"అర్ఆర్ఆర్" 11 వ రోజు ఎంత వసూలు చేసింది తెలుసా?

RRR Movie Box Office Collection Day 11
x

"అర్ ఆర్ ఆర్" 11 వ రోజు న ఎంత వసూలు చేసింది తెలుసా?

Highlights

"అర్ ఆర్ ఆర్" 11 వ రోజు న ఎంత వసూలు చేసింది తెలుసా?

RRR Collections: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన చిత్రం "అర్ ఆర్ ఆర్" (రౌద్రం రణం రుధిరం). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2 రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఈ చిత్రం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కెరీర్లో మైలురాయిగా మారింది.

ఈ సినిమా విడుదలై ఈ వారం రోజులు దాటినా ఇప్పటికీ కలెక్షన్లు మాత్రం ఇంకా ఆకాశాన్ని అంటుతున్నాయి.సినిమా విడుదలైన పదకొండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 4.9 కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం టికెట్ ధరల వల్ల సినిమా కలెక్షన్లు కొంచెం దెబ్బతిన్నాయని కూడా చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 508.37 కోట్ల షేర్ ని అలాగే 898.7 కోట్ల గ్రాస్ ని రాబట్టగలిగింది. ఏదేమైనా ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉంది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories