ఓటిటి ఫ్యాన్స్‌కు RRR బిగ్ షాక్..!

RRR OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ..

Arun Chilukuri
Updated on: 9 May 2022 7:06 PM IST
RRR Movie Big Shock to OTT Fans
X

ఓటిటి ఫ్యాన్స్‌కు RRR బిగ్ షాక్ షాక్..!

RRR OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన మల్టీస్టారర్ ఇండియన్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి సినిమా తరువాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించారు. ఈ సినిమా మార్చ్ 24న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డుల వర్షం కురిపించింది. కొన్ని ప్రాంతాల్లో బాహుబలి కలెక్షన్లను సైతం దాటి ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల డిజిటల్ రైట్స్ ను జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మే 20న జి 5 మరియు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అభిమానులు కూడా ఈ సినిమాని మళ్లీ చూసేందుకు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్‌ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్‌ ప్లాట్‌పామ్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story