RRR Movie Update: ఆర్ఆర్ఆర్ గురించి విజయేంద్ర ప్రసాద్ ఓ రేంజ్ లో...

RRR Movie Update: ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Kranthi
Updated on: 26 May 2021 9:30 AM IST
RRR Fight Action Sequences May Get Teas Vijayendraprasad
X

RRR Writer Vijayendraprasad:(File Image)

RRR Movie Update: సినిమాకు హైప్ తెచ్చేలా మార్కెటింగ్ టెక్నాలజీని వాడటంలో రాజమౌళి టీమ్ ను మించినోళ్లు లేరు అని అంటారు సినీ వర్గాల్లో. బాహుబలి అన్నాళ్లు షూటింగ్ జరుపుకున్నా.. ఎప్పుడో ఏదో ఒక హడావుడి చేస్తూ.. క్రేజ్ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. లుక్స్ రిలీజ్ చేయటం.. కాస్త స్టోరీ లీక్ చేయడం.. క్యాస్టింగ్ లో కూడా ఒక్కొక్కరిని చూపిస్తూ క్రేజ్ పెంచుకోవటం ఇప్పటికే చేస్తున్నారు. ఇప్పుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగారు. ఫైట్స్ చూసి ఆవేశం రావడం తెలుసు.. లేదా హుషారెక్కడం తెలుసు.. కాని ఏడవడం తెలుసా.. ఆర్ఆర్ఆర్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రాసిన నాకే కన్నీళ్లు వచ్చాయి... ప్రేక్షకుకులకు కూడా వస్తాయంటూ ఓ రేంజ్ లో సినీజనం ఎమోషన్ ను చాలా ఎమోషనల్ గా టచ్ చేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, హీరోల మోషన్ పోస్టర్స్ కు రెస్పాన్ మాములుగా రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి.. అలాగే హీరోల్ రోల్స్ కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌ అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

అలాగే ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ గురించి వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను.. చిత్రరచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చిత్ర రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం మంచి పని కాదు.. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది.

సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ.. గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఏదో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. మొదటి సారి ఫైట్ సీక్వెన్సెస్ కి ఎమోషన్ అవుతారు" అని అన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డీవీవి దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు.

Kranthi

Kranthi

Next Story