అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' దీపావళి గిఫ్ట్..అదిరిపోయింది!

అభిమానులకు ఆర్ఆర్ఆర్ దీపావళి గిఫ్ట్..అదిరిపోయింది!
x
Highlights

ఆర్ఆర్ఆర్ నుంచి దీపావళి కానుక

ఆర్ఆర్ఆర్ (రాజమౌళి-రామారావు-రామ్ చరణ్) విడి విడిగానే పెద్ద సంచలనం. మరి ముగ్గురు కలిస్తే.. అభిమానులకు పండగే పండగ. ఈ ముగ్గురు కలిసి ఆర్ఆర్ఆర్ పేరుతో భారీ సినిమా సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ లు విడుదల చేసింది చిత్ర బృందం. వాటికి అభిమానుల నుంచి పిచ్చ రెస్ట్పాన్స్ వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ నుంచి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముగ్గురూ కలిసి అద్భుతం సృష్టిస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఇంకో టీజర్ వస్తుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ, అభిమానుల అంచనాలను మించి చేయడం రాజమౌళికి బాగా అలవాటు కదా. అందుకే ఈసారి ఈ ట్రిపుల్ ఆర్ ఓ సర్ప్రైస్ ఇచ్చారు. ముగ్గురూ ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫోటో విడుదల చేశారు దీపావళి కానుకగా. రాజమౌళి.. ఎదురగా ఎన్టీఆర్, రాంచరణ్ కూచుని ఉన్నారు ఆ ఇమేజిలో. నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ అనే ఇంగ్లేష్ అక్షరాలు దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నాయి. తెల్లని దుస్తులతో గురువు ముందు శిష్యుల్లా ఎన్టీఆర్, రాం చరణ్ కూచుని ఉన్న ఈ ఫోటో అభిమానులకు దీపావళి పండగ తెచ్చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories