RRR: ఎన్టీఆర్, చెర్రీల ఎంట్రీ సాంగ్‌పై క్రేజీ న్యూస్!

RRR Movie: రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ బయటకు వస్తూనే ఉంది.

Venkata Chari
Published on: 1 Jun 2021 8:44 PM IST
RRR: Crazy Update Viral On Ntr, Ram Charan Entry Song
X

ఎన్టీఆర్, రామ్ చరణ్ (ఫొటో ట్విట్టర్)

RRR Movie: రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ బయటకు వస్తూనే ఉంది. అలా వచ్చిందో లేదో.. నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్‌ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాలో కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలిందంట. మిగిలిన ఈ పార్ట్ పూర్తి చేసేందుకు కనీసం 45 నుంచి 50 రోజులు పడుతుందంట. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్‌, రామ్ చరణ్.. అలియాభట్ సాంగ్ లు ఉన్నాయంట. ఎంట్రీ సాంగ్‌ పూర్తి కావడానికే కనీసం 30రోజుల సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. విజువల్ వండర్‌లా ఈ సాంగ్‌ను ప్లాన్ చేశారట దర్శకధీరుడు.

ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగ్‌ మొదలు పెట్టనున్నారంట. అలాగే కొమరంభీమ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కంటతడి పెట్టిస్తారంటూ విజయేంద్ర ప్రసాద్ ఈమధ్య వెల్లడించడంతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story