శ్రీకాంత్ కొడుకుతో దర్శకేంద్రుడి పెళ్లి సందడి!

శ్రీకాంత్ కొడుకుతో దర్శకేంద్రుడి పెళ్లి సందడి!
x
Highlights

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది.

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు..

తాజాగా ఈ సినిమాలో హీరోని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ సినిమాలో రోషన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇదే టైటిల్ తో ఒకే దర్శకుడితో తండ్రి కొడుకులు సినిమాలు చేయడం విశేషం.. ఇక ఇప్పటికే రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. తిరిగి గ్యాప్ తీసుకొని రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి..

ఇక ఈ సినిమాని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. అటు దాదాపుగా మూడేళ్ళ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అయన సినిమాలను చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories