Roshan Meka: రెండు బడా బ్యానర్లతో సినిమాలు సైన్ చేసిన హీరో తనయుడు

Roshan Meka: టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ల తో సినిమా చేయబోతున్న రోషన్

Rama Rao
Updated on: 24 Jan 2022 7:42 AM IST
Roshan is Going to Make a Film With Top Production Banners | Tollywood News Today
X

టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ల తో సినిమా చేయబోతున్న రోషన్

Roshan Meka: "నిర్మలా కాన్వెంట్" సినిమా తో అంతగా మెప్పించలేకపోయిన శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ మధ్యనే మళ్లీ "పెళ్లి సందడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1996లో శ్రీకాంత్ హీరో గా విడుదలై సూపర్ హిట్ అయిన "పెళ్లి సందడి" సినిమాకి రిటెల్లింగ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. రోషన్ కొత్తవాడయినప్పటికీ సినిమా చూడటానికి అభిమానులు తరలి వచ్చారు. బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోవైపు దిల్రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి మొదటి సినిమా "రౌడీ బాయ్స్" కలెక్షన్ల పరంగా యావరేజ్ గానే మిగిలిపోయింది.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా "హీరో" కూడా అంత చెప్పుకోదగ్గ కలెక్షన్ లేమి చేయలేదు. దీంతో ఈ ముగ్గురిలో రోషన్ కి క్రేజ్ ఎక్కువగా ఉండడంతో ఆఫర్లు భారీగా వస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ రెండు సినిమాలతో రోషన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థల జాబితాలో ఉండే ఈ రెండు బ్యానర్లతో సినిమా చేయడం రోషన్ కరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం లేకపోలేదు.

Rama Rao

Rama Rao

Next Story