Roja: జబర్థస్త్ షోలోకి రోజా రీ ఎంట్రీ.. ఇంద్రజ ఔట్..?

Roja: జబర్థస్త్ లోకి రోజా రీ ఎంట్రీ ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది

Samba Siva Rao
Updated on: 9 May 2021 3:06 PM IST
Roja: Roja Re-Entry in Jabardasth Comedy Show
X

రోజా (ఫైల్ ఇమేజ్)

Roja: తెలుగు టెలివిజ‌న్ తెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ కొన్నెళ్ల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో చాలామంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.

జబర్థస్త్ లోకి రోజా రీ ఎంట్రీ ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ చాన‌ల్ లో గ‌త కొన్నేళ్లుగా ప్ర‌సారం అవుతున్న కామెడీ షో జ‌బ‌ర్థ‌స్త్. ఈ షోలో రోజా జ‌డ్జిగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శస్త్రచికిత్స తరువాత పూర్తిగా కోలుకున్న జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ షూటింగ్ లో కూడా పాల్గొనట్టు తెలుస్తోంది. రోజా నవ్వులు మిస్ అయ్యాం అయ్యాం అని అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. ఈ షోలో రోజా లేక‌పోతే అంతా ఆందోళ‌ల‌ను గురైయ్యేవారు. రోజా మ‌ళ్లీ షో ద్వారా మ‌ళ్లీ అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. దీంతో రీఎంట్రీ ఖాయం అని తెలుస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నట్టు సమాచారం. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదే సమయంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా ఆసక్తికరంగా స్పందించారు. జబర్దస్త్ ద్వారా ఎంత ప్రేమ దక్కుతుంది అనేది కళ్లారా చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇంద్రజ ఈషో నుంచి బ‌య‌ట‌కు తప్పుకునే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది. 2019లో వైపీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన రోజా మంత్రి ప‌ద‌వి ఖాయం అని వార్త‌లు వ‌స్తున్నాయి.కుల స‌మీక‌ర‌ణ‌ల కార‌ణంగా రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. క‌రోనా కార‌ణంగా ఈ సారి మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని. దీంతో మంత్రి పదవి అధికారికంగా ప్రకటించే వరకు జబర్థస్త్ లో కొనసాగలని రోజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story