Hyderabad: షూటింగులో గాయపడిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఆస్పత్రికి తరలింపు..

Hyderabad: షూటింగులో గాయపడిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఆస్పత్రికి తరలింపు..

Arun Chilukuri
Published on: 7 Jan 2023 5:05 PM IST
Rohit Shetty Injured During Indian Police Force Shoot in Hyderabad
X

Hyderabad: షూటింగులో గాయపడిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఆస్పత్రికి తరలింపు..

Rohit Shetty: బాలీవుడ్ "సింగం" సిరీస్ ఫేమ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి శనివారం నాడు హైదరాబాదులో తన ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శెట్టి చేతికి పెద్ద గాయం అయింది. వెంటనే చిత్ర బృందం రోహిత్ శెట్టిని దగ్గర్లో ఉన్న కామినేని హాస్పిటల్స్ కు తరలించారు. రోహిత్ శెట్టి పరిస్థితి నీ పరీక్షించిన డాక్టర్లు అతని చేతికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే ఇండియన్ పోలీస్ ఫోర్స్ మీద రాబోతున్న వెబ్ సిరీస్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర బృందం పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కార్స్ హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ లు కూడా చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక కార్ చేజ్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రోహిత్ శెట్టి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత రోహిత్ శెట్టి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రోహిత్ శెట్టి ఆరోగ్యం గురించి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమ్ కానుంది. అయితే గతేడాది మేలో కూడా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాలో జరుగుతున్న సమయంలో సిద్ధార్థ మల్హోత్రా కూడా గాయాల వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. వివేక్ ఒబెరాయ్ మరియు శిల్పా శెట్టి కూడా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story