Viral Post: ధనశ్రీతో విడాకులు.. చాహల్‌తో డేటింగ్‌.. మహ్‌వశ్‌ వైరల్ పోస్ట్‌

Viral Post: ధనశ్రీతో విడాకులు.. చాహల్‌తో డేటింగ్‌.. మహ్‌వశ్‌ వైరల్ పోస్ట్‌
x
Highlights

Viral Post: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , సోషల్ మీడియా ఇన్ ఫ్లుయోన్సర్, రేడియో జాకీ మహ్వశ్ తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం...

Viral Post: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , సోషల్ మీడియా ఇన్ ఫ్లుయోన్సర్, రేడియో జాకీ మహ్వశ్ తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహ్ వశ్ తాజాగా ఇన్ స్టా స్టోరీస్ వేదికగా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తనకు బెస్ట్ మెగా ఇన్ ఫ్లుయెన్సర్ అవార్డు రావడంపై ఆమె స్పందించారు.

నేను ఈ స్థాయికి చేరుకోవడం చూసి చిన్ననాటి మహ్ వశ్ ఎంతో గర్వపడుతుంది. ఇది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఏ తప్పు లేకుండా ఎలాంటి అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ ముందుకు సాగిపోవాలని ఆమె రాసుకొచ్చారు. డేటింగ్ వార్తల వేళ ఆమె పెట్టిన ఈ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా కథనాలను ఉద్దేశించే ఆమె ఈ విధంగా పెట్టిందని పలువురు భావిస్తున్నారు.

ఇక చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను మహ్ వశ్, చాహల్ ఇద్దరు కలిసి వీక్షించారు. మ్యాచ్ కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి కనిపించం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్ లోనూ ఛాహల్ తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె షేర్ చేశారు. అప్పట్లోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని మహ్ వశ్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమని తప్పుడు కథనాలు క్రియేట్ చేయవద్దని కోరింది. ఈ డేటింగ్ మరోసారి తెరపైకి రావడంతో మహ్ వశ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories