Tamannaah Bhatia: ప్లాన్ ఏ ప్లాన్ బీ అంటున్న తమన్నా

Plan A Plan B: ఒకవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే, మరోవైపు అన్నీ వర్గాల లోనూ అడుగుపెడుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

admin1
Updated on: 16 Aug 2021 9:30 PM IST
Riteish Deshmukh, Tamannaah Bhatia star in Netflixs Plan A Plan B
X

Tamannaah Bhatia: ప్లాన్ ఏ ప్లాన్ బీ అంటున్న తమన్నా

Plan A Plan B: ఒకవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే, మరోవైపు అన్నీ వర్గాల లోనూ అడుగుపెడుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమా కోసం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో జతకట్టింది తమన్నా. ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమన్నా ఒక మ్యాచ్ మేకర్ గా కనిపించనుంది. అయితే తాను మాత్రం పెళ్లి అనే పదానికి సైతం దూరంగా ఉండాలి అనుకునే అమ్మాయిగా తమన్నా పాత్ర ఉండబోతోంది. మరి అలాంటి అమ్మాయి కి మరియు ఒక డివోర్స్ లాయర్ కి మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం.

టైటిల్ తోనే ఆసక్తి కలిగించిన ఈ సినిమాని కి శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. "ఖూబ్సూరత్" మరియు "వీరే ది వెడ్డింగ్" వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశాంక ఘోష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పూనం దిల్లోన్ మరియు కుశా కపిల ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రజత్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రం త్వరలో నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా తమన్నా తన ఇంస్టాగ్రామ్ ప్లాట్ ఫాం లో షేర్ చేసుకుంది. ఇండియా స్టోరీస్ మీడియా మరియు ఫంక్ యువర్ బ్లూస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

admin1

admin1

Next Story