Kantara: ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్న రిషబ్ శెట్టి..

Kantara: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ మధ్యనే "కాంతారా" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 12:11 PM IST
Rishab Shetty Thanks Jr NTR
X

Kantara: ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్న రిషబ్ శెట్టి..

Kantara: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ మధ్యనే "కాంతారా" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కన్నడలో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అభిమానులు మాత్రమే కాక సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. తాజాగా సినిమా చూసిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకి ఫోన్ చేసి మరి ప్రశంసలను అందించారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పకు వచ్చారు రిషబ్ శెట్టి.

"కాంతారా చూసిన వెంటనే ఆయన నాకు కాల్ చేశారు. నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. అందుకని నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను," అని అన్నారు రిషబ్ శెట్టి. ఇక వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చాలా బాగుంటుందని అలాంటి ప్రాజెక్టు ఏమైనా ఆలోచించారా అని అడగగా "అలా ఎప్పుడూ ఆలోచించలేదు. స్టోరీ మరియు కాన్సెప్ట్ ఫిక్స్ అయ్యాక మాత్రమే కాస్టింగ్ గురించి ఆలోచించాలి. ఒక యాక్టర్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఎలా రాస్తాము? నేనలా రాయలేను. కేవలం స్టోరీ అయిపోయాక నేను కాస్టింగ్ గురించి ఆలోచిస్తాను," అని అన్నారు రిషబ్ శెట్టి.

ఇక కిరిక్ పార్టీ సీక్వెల్ గురించి అడగగా ఒక రెండు నెలల బ్రేక్ తీసుకున్న తర్వాతే మిగతా సినిమాలు గురించి ఆలోచిస్తానని అన్నారు రిషబ్ శెట్టి. కాంతారా సీక్వెల్ గురించి ఇప్పుడే మాట్లాడటం కష్టమని ఇంకా తాను కాంతారా సినిమా ప్రమోషన్స్ లోనే ఉన్నానని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story