Rishab Shetty: రష్మికకి గట్టి కౌంటర్ ఇచ్చిన రిషబ్ శెట్టి

Rishab Shetty - Rashmika Mandanna: కన్నడ "కిరిక్ పార్టీ" సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Arun Chilukuri
Published on: 23 Nov 2022 5:42 PM IST
Rishab Shetty Refuses to Work With Rashmika Mandanna?
X

Rishab Shetty: రష్మికకి గట్టి కౌంటర్ ఇచ్చిన రిషబ్ శెట్టి

Rishab Shetty - Rashmika Mandanna: కన్నడ "కిరిక్ పార్టీ" సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అసలు ఆమెకు హీరోయిన్ గా మొదటి ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టి. కిరిక్‌ పార్టీ తర్వాతే రష్మికకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ లో బిజీగా ఉండే హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

మరోవైపు ఈ మధ్యనే రిషబ్ శెట్టి కన్నడలో "కాంతార" తో బ్లాక్ బస్టర్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. తాజాగా రిషబ్ శెట్టి రష్మిక గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యనే "కాంతార" సినిమా చూశారా అని అడగగా రష్మిక చూడలేదని చెప్పడంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. మరొక ఇంటర్వ్యూలో తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు బయటకు రాకుండా తన ఫోటో చూసి అవకాశం వచ్చిందని చెప్పటం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిషబ్ రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సాయి పల్లవి, సమంత, మరియు రష్మిక లలో ఎవరితో నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నారు అని అడగగా కొంతమంది హీరోయిన్స్ తో అసలు పని చేయాలని అనుకోవడం లేదు అన్న రిషబ్ శెట్టి సాయి పల్లవి మరియు సమంతల పనితనం తనకు ఇష్టమని అన్నారు. అలాగే కొత్త హీరోయిన్లతో కూడా పనిచేయాలని ఉంది అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతుందని చెప్పుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story