Richa Gangopadhyay: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..!

Richa Gangopadhyay: తమిళంలో 'మాయక్కమ్ ఎన్న'(తెలుగులో Mr. కార్తిక్) - 'ఒస్తే'.. బెంగాలీలో 'బిక్రమ్ సింఘా' చిత్రాల్లో నటించింది

Samba Siva Rao
Published on: 5 Jun 2021 3:47 PM IST
Richa Gangopadhyay Gives Birth to a Baby boy
X

రిచా గంగోపాధ్యాయ (ట్విట్టర్ ఇమేజ్ ) 

Richa Gangopadhyay: తెలుగు హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రానా న‌టించిన‌ 'లీడర్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ.. ఆ తర్వాత 'నాగవల్లి' 'మిరపకాయ్' 'భాయ్' వంటి సినిమాల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన 'మిర్చి' సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. తమిళంలో 'మాయక్కమ్ ఎన్న'(తెలుగులో Mr. కార్తిక్) - 'ఒస్తే'.. బెంగాలీలో 'బిక్రమ్ సింఘా' చిత్రాల్లో నటించింది. 'భాయ్' తర్వాత సినిమాలకు దూరమైన రిచా.. ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిపోయింది.

ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను ప్రేమించి 2019లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది రిచా. వివాహమయ్యాక చాలా రోజులకు కానీ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సీక్రెట్ గా ఉంచింది, మే 27న తనకు బాబు పెట్టాడని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ప్రసవ సమయంలో తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు రిచా వైద్యులు , నర్సింగ్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు పుట్టిన బాబు ఫోటోని షేర్ చేసింది రిచా.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story