Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా..?

Miss Universe India 2024: మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 Sept 2024 11:45 AM IST
Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా..?
X

Miss Universe India 2024: ఎవరీ రియా సింఘా..?

Miss Universe India 2024: మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపుర్ లో ఈ పోటీలు నిర్వహించారు. గుజరాత్ కు చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయస్సులోనే ఈ అందాల పోటీల్లో నెగ్గారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఆమె ఈ కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఊర్వశీ రౌతేలా ఈ పోటీలకు జడ్జిగా వ్యవహరించారు.గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024 లో భారత్ కు రియా ప్రాతినిథ్యం వహించనున్నారు. రియా ఈ పోటీల్లోనూ విజేతగా నిలువాలని కోరుకుంటున్నట్టుగా ఊర్వశీ చెప్పారు.

ఎవరీ రియాసింఘా?

గుజరాత్ అహ్మదాబాద్ కు రియాసింఘా ఆర్ట్స్ లో డిగ్రీని పట్టా పొందారు. జీఎల్ఎస్ యూనివర్శిటీ నుంచి ఆమె పట్టా పొందారు. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా ఈమె పేరేంట్స్. రియా తండ్రి పారిశ్రామికవేత్త. ఈ స్టోర్ డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆమె 16 ఏళ్ల వయస్సున్నప్పుడే అంటే 2020లోనే మోడలింగ్ లో అడుగుపెట్టారు. అప్పట్లోనే 'దివాస్ మిస్ టీన్ గుజరాత్'టైటిల్ ను కైవసం చేసుకున్నారు. 2023లో స్పెయిన్ మాడ్రిడ్ లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023 లో పాల్గొన్నారు. 25 మందితో పోటీ టాప్ 6లో ఆమె స్థానం పొందారు.

వారి నుంచే స్పూర్తి పొందా

మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని దక్కించుకోవడం పట్ల రియా సింఘా సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్థాయికి రావడానికి తాను ఎంతో కష్టపడినట్టుగా ఆమె చెప్పారు. అంతకుముందు ఈ కిరీటాన్ని దక్కిచుకున్నవారి నుంచే తాను స్పూర్తి పొందినట్టుగా చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story