RGV with HMTV: దాడిపై స్పందించిన డైరెక్టర్ వర్మ.

RGV with HMTV వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పైన దాడికి జరిగింది. దాడికి దిగిన ఎనమిది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు

Krishna
Updated on: 24 July 2020 7:11 AM IST
RGV with HMTV: దాడిపై స్పందించిన డైరెక్టర్ వర్మ.
X
RGV Response on Attack in his Office

RGV with HMTV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పైన దాడికి జరిగింది. దాడికి దిగిన ఎనమిది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దర్శకుడు వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికి సినిమాకి సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసిన వర్మ పెద్ద వివాదానికి తెరలేపాడు. అయితే సినిమా ప్రచారంలో భాగంగా అయన 'తన ఆఫీస్ కి ఎవరైనా రావొచ్చు' అని అన్నారని, దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.. దీనితో కొందరు అక‌స్మాత్తుగా ఆర్జీవీ కార్యాల‌యంపై దాడి చేశారు, ఆఫీస్ లో ఉన్న పర్నిచర్ ద్వంసం చేశారు. ఈ సంఘటనలో కొందరికి గాయాలు అయ్యాయి.

అయితే ఈ ఘటన పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. " పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ దాడి చేసి ఉంటారేమో అని భావిస్తున్నట్లుగా వర్మ వెల్లడించారు. కొంతమంది పనిలేక పుబ్లిసిటీ కోసం దాడి చేశారని పేర్కొన్నారు. నా ఇష్టం వచ్చినట్లు సినిమా తీసే హక్కు నాకుందని, ఫిక్షన్ తో ఎవరైనా ఎలాంటి సినిమానైన తీయవచ్చునని వర్మ స్పష్టం చేశారు. ఇక కుక్కలు అరుస్తాయి.. నేను భయపడను అంటూ వర్మ పేర్కొన్నారు. అయితే ఈ ఘటన పైన పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా వర్మ స్పష్టం చేశారు. ఇక చివరగా నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అని , సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా అయన అంటూ వెల్లడించారు.

ఇక పవర్ స్టార్ సినిమా విషయానికి వచ్చేసరికి పవర్ స్టార్ సినిమాని జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నాడు వర్మ.. ఇప్పటివరకు ట్రైలర్ , పాటతో పెద్ద వివాదాలు సృష్టించిన వర్మ ఇక సినిమాని విడుదల చేసి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తారో చూడాలి.




Krishna

Krishna

Next Story