Vyuham Movie: ఇండిపెండెన్స్‌ డే స్పెషల్.. ఆర్జీవీ వ్యూహం సెకండ్ టీజర్ రిలీజ్

Vyuham Movie: ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలను తెరకెక్కించిన ఆర్జీవీ

Shekhar G
Updated on: 15 Aug 2023 12:42 PM IST
RGV Vyuham Movie Second Teaser Release
X

Vyuham Movie: ఇండిపెండెన్స్‌ డే స్పెషల్.. ఆర్జీవీ వ్యూహం సెకండ్ టీజర్ రిలీజ్

Vyuham Movie: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సీఎం జగన్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్‌ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు.

ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తోంది చిత్రం యూనిట్. వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇందులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్రలను తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, షర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాలను షూట్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులను చూపించడంతో టీజర్ ఆరంభమౌతుంది.

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఇలా అన్ని ప్రధాన పాత్రలూ ఈ టీజర్‌లో కనిపించాయి. ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి పాత్రను కూడా పరిచయం చేశారు ఆర్జీవీ. ఓ సన్నివేశంలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పాత్రలు సైతం కనిపిస్తాయి. వైఎస్సార్ హఠాన్మరణం ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన.. వంటి సున్నిత అంశాల.. ఈ టీజర్‌లో కట్ చేశారు. ప్రతిపక్ష హోదాలో జగన్ చేసిన నిరాహార దీక్షలు, అక్రమ కేసులతో జైలు జీవితాన్ని గడపడం వంటివీ ఇందులో ఉన్నాయి.


Shekhar G

Shekhar G

Next Story