RGV: రేవంత్ రెడ్డి సింహంలాంటి వ్యక్తి... ఆర్టీవీ

RGV: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని నియమించడం పట్ల దర్శకుడు ఆర్టీవీ హర్షం వ్యక్తం చేశారు.

Kranthi
Published on: 27 Jun 2021 12:11 PM IST
RGV Tweet on PCC Chief Revanth Reddy
X

RGV - PCC Chief Revanth Reddy:(File Image)

RGV: టీపీసీసీ చీప్ గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన నేప‌థ్యంలో సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు.

స‌మాజాంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల ప‌ట్ల త‌నదైన శైలిలో స్పందించే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రేవంత్ రెడ్డిపై కూడా ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌జీవీ ట్వీట్ చేస్తూ.. `ల‌య‌న్‌.. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించి.. కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కు ఒక సూప‌ర్, ఫెంటాస్టిక్ నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇక ఇప్పుడు పులుల‌న్నీ… రేవంత్ రెడ్డి అనే సింహానికి భ‌య‌ప‌డ‌తాయి` అంటూ ట్వీట్ చేశారు. ఇక మ‌రో ట్వీట్‌లో.. `రేవంత్‌రెడ్డిని అధ్య‌క్షుడిగా ఎన్నుకున్న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీపై మ‌రోసారి ఆస‌క్తి క‌లిగింది. రాహుల్ గాంధీ నువ్వు, మీ అమ్మ ఒక గొప్ప ప‌ని చేశారు` అంటూ ట్వీట్ చేశారు.

గ‌త కొన్ని రోజులుగా పీసీసీ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ కాంగ్రెస్ అధిష్టానం ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనప్ప‌టికీ చివ‌రికి కాంగ్రెస్ పెద్ద‌లు రేవంత్ వైపే మొగ్గు చూపారు.




Kranthi

Kranthi

Next Story