Ram Gopal Varma: జనసైనికుల ముందు ఆర్జీవీ ఫెయిల్.. పాపం ఊహించి ఉండడు..

Ram Gopal Varma: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

Jyothi
Published on: 13 May 2023 12:07 PM IST
RGV once again Made Sensational Comments on Pawan Kalyan
X

Ram Gopal Varma: జనసైనికుల ముందు ఆర్జీవీ ఫెయిల్.. పాపం ఊహించి ఉండడు..

Ram Gopal Varma: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ఆర్జీవీకి సంబంధం లేకున్నా రాజకీయ నేపథ్య కథాంశాలతో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, టీడీపీ- జనసేనకు వ్యతిరేకంగా...వైసీపీకి అనుకూలంగా ఉంటున్న ఆర్జీవీ..చంద్రబాబు, పవన్ పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేవలం డబ్బు కోసమే తన సొంత కాపులను కమ్మవాళ్లకు అమ్మేశాడని RIP కాపులు అని ఆర్జీవీ...పవన్-చంద్రబాబు భేటీ సందర్భంగా ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. కట్ చేస్తే, తాజాగా పవన్ తూర్పుగోదావరి జిల్లా రైతుల పరామర్శ సందర్భంగా పొత్తులపై పవన్ స్పందించారు. దీనిపై ఆర్జీవీ మరోసారి కౌంటర్ వేశారు.

2024 ఎన్నికల్లో జనసేన పొత్తులతోనే ముందుకెళుతుందని...పొత్తులపై తన స్టాండ్ మారలేదని క్లారిటీ ఇచ్చారు. త్రిముఖ పోరులో బలి కావడానికి సిద్ధంగా లేనని పవన్ తేల్చి చెప్పారు. అంతేకాదు, కండిషన్లు పెట్టి సీఎం పదవి సాధించలేమని..సీఎం పదవి వరించి రావాలని కూడా స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఆర్జీవీ తాజాగా ట్వీట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు...ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినదానికంటే దారుణంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ తన జనసైనికులను, తన ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేశారని ఆర్జీవీ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన ప్రగాఢ సానుభూతి అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు.

ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సాధారణంగా వైరల్ కావాలి. అంతేకాదు, జనసైనికులు సైతం తమ ఇష్టారీతిలో రాంగోపాల్ వర్మతో ట్విట్టర్ వార్ సాగించాలి. జనసైనికుల ట్వీట్లకు ఆర్జీవీ తనదైన రీతిలో బదులు ఇవ్వాలి..రాంగోపాల్ వర్మ సైతం ఇదే ఊహించి పవన్ పై ట్వీట్ చేశారు. కానీ, ఆర్జీవీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆర్జీవీ చేసే ప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని జనసైనికులు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారో లేక...ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని భావించారో తెలియదు కానీ...పవన్ పై రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై జనసైనికులు ఎక్కడా ఆగ్రహించినట్లు కనపడలేదు. మొత్తంగా, పవన్ పై జనసైనికులను ఎగదోద్దామని ఆర్జీవీ వేసిన స్కెచ్...అతడు తీసిన ఐస్ క్రీమ్ లానే కరిగిపోయింది.

Jyothi

Jyothi

Next Story