RGV Natti Kumar: మా ఇష్టం.. కలిశాం..

RGV Natti Kumar: మా ఇష్టం సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది.

Arun Chilukuri
Published on: 11 Jun 2022 7:32 AM IST
RGV Natti Kumar Controversy End
X

RGV Natti Kumar: మా ఇష్టం.. కలిశాం..

RGV Natti Kumar: మా ఇష్టం సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. పరసర్పరం నమోదు చేసుకున్న కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు వర్మ, నట్టికుమార్ ప్రకటించారు. వర్మ రూపొందించిన మా ఇష్టం సినిమాతో వీరిద్దరి వివాదం మొదలైంది. నట్టి ఎంటర్‌టైన్మెంట్స్ చెందిన నట్టి క్రాంతి కుమార్..నట్టి కరుణ రాంగోపాల్ వర్మపై కోర్టును ఆశ్రయించారు.

తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేస్తున్నారని పిటిషన్ వేశారు. కోర్టు స్టే ద్వారా మా ఇష్టం సినిమా విడుదలను అడ్డుకున్నారు. అయితే తన లెటర్ హెడ్‌ను కాపీ చేశారని..తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వర్మ గత నెలలో నట్టి క్రాంతి కుమార్‌, నట్టి కరుణలపై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో వివాదం ముగిసింది. కేసులను వెనక్కి తీసుకున్నట్లు ఇరువురు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story