ఈ నెల 24న రిలీజ్ కానున్న మర్డర్ మూవీ

ఈ నెల 24న రిలీజ్ కానున్న మర్డర్ మూవీ
x
Highlights

మర్డర్ సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ అని సెన్సేషల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నామని తెలిపారు.

మర్డర్ సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ అని సెన్సేషల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే.. తాము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఈ మూవీ పిల్లల ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఏం జరుగుతుందనేది మాత్రమే చూపిస్తుందన్నారు. ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు. అనురాగ్ కంచర్ల సమర్ఫకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి ముఖ్యపాత్రల్లో నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories