RGV Murder Movie Update : మర్డర్ నుంచి వర్మ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వర్మ!

RGV Murder Movie Update : మర్డర్ నుంచి వర్మ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వర్మ!
x
Murder movie
Highlights

RGV Murder Movie Update : వివదాస్పద దర్శకుడు తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్.. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్

RGV Murder Movie Update : వివదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్.. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వర్మ.. ఆనంద్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు వర్మ. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల చేసిన వర్మ సినిమా పైన భారీ అంచనాలను పెంచిన వర్మ తాజాగా సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశాడు వర్మ..

సోషల్ మీడియా వేదికగా మంగళవారం హైదరాబాద్లో రాంగోపాల్ వర్మ ఆ పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటను స్వయంగా వర్మేనే పాడడం విశేషం.. పిల్లల్ని ప్రేమించడం తప్పా అటూ ఈ పాట సాగుతుంది. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాతనే విడుదల చేస్తామని వెల్లడించారు.

మొత్తం ఈ సినిమాని అయిదు భాషల (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పైన అమృత తన ఆవేదనని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories