RGV comments on pawan latest look : పవన్ గెటప్‌పై వర్మ హేళనలు!

RGV comments on pawan latest look: యంగ్ హీరో నితిన్ ప్రీ వెడ్డింగ్ కి దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి హాజరయ్యారు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

Krishna
Published on: 24 July 2020 10:45 PM IST
RGV comments on pawan latest look : పవన్ గెటప్‌పై వర్మ హేళనలు!
X
director varma satirical tweets on pawan kalyan new look

RGV comments on pawan latest look : యంగ్ హీరో నితిన్ ప్రీ వెడ్డింగ్ కి దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి హాజరయ్యారు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్...హైదరాబాద్‌లోని ఓ ప్యాలెస్‌లో నితిన్-షాలినీల వివాహం జరగనుండగా.. గురువారం మెహందీ ఫంక్షన్ జరిగింది. దీనికి వారు హాజరై నితిన్ ఆశీర్వదించారు. అయితే ఇందులో పవన్ పూర్తిగా ఆధ్యాత్మిక గెటప్‌లో కనిపించారు గుబురు గడ్డం, బొట్టుతో కనిపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షలో ఉండడంతో అయన ఈ లుక్ లో కనిపించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే పవన్ లుక్ పైన వివదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. బాబాగా మారిన బాబు అంటూ ట్విట్ చేశారు వర్మ.. అంతేకాకుండా పవన్‌ని బాబా అంటూ హేళన చేస్తూ నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అంటూ వరుస ఫొటోలను షేర్ చేస్తున్నాడు వర్మ... నాకు బాబస్ మీద నమ్మకం లేదు కానీ నేను ఈ బాబు బాబాను నమ్ముతాను అంటూ వరుస ట్వీట్లు చేశాడు. అయితే వర్మ తీరు పైన పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




ఇటివల పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు.. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిసి నాలుగు మాసాల పాటు పవన్‌ కల్యాణ్‌ ఈ దీక్షలో కొనసాగనున్నారు. దీక్ష విరమణ రోజున హోమాన్ని నిర్వహించి.. పూర్ణాహూతితో దీక్షను విరమించనున్నారు.

అటు దర్శకుడు వర్మ పవర్ స్టార్ పేరిట ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ట్రైలర్, ఓ పాటను రిలీజ్ చేసి పెద్ద వివాదాన్నే సృష్టించాడు వర్మ.. ఈ సినిమాని రేపు ఉదయం 11 గంటలకి అర్జీవీ వరల్డ్ ధియేటర్లో విడుదల చేయనున్నాడు వర్మ.. ఇక సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి!

Krishna

Krishna

Next Story