Top
logo

అద్దాలు పగిలేలా అఖిల్‌కు ముద్దులు, హగ్గులు

అద్దాలు పగిలేలా అఖిల్‌కు ముద్దులు, హగ్గులు
X
Highlights

కష్టాలు, కన్నీళ్లు, విరోధాలు, వినోదాలు, ఆనందాలు, అనురాగాలను పంచే వేదిక బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ చిత్కరాలుంటాయి....

కష్టాలు, కన్నీళ్లు, విరోధాలు, వినోదాలు, ఆనందాలు, అనురాగాలను పంచే వేదిక బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ చిత్కరాలుంటాయి. సత్కరాలుంటాయి. కోపాలస్తాయి. నవ్వులు పూస్తాయి. ఇలా నవరసాలను, ఎన్నో భావోద్వేగాలను పండించే మాగాణి బిగ్‌బాస్ హౌస్. ఈ జర్నీలో కంటెస్టెంట్లు ప్రాణ స్నేహితులైపోతారు. అంతలోనే బద్ధశత్రువులైపోతారు. నచ్చకుంటే నామినేషన్‌ చేసేస్తారు. కానీ ఒక్కసారి బయటకు వచ్చాక అన్ని మర్చిపోయి సరదాగా సాగిపోతారు. హౌస్‌లో జరిగిన ఏ సంఘటనైనా వాళ్లకి తీపి జ్ఞాపకమే.. అలాంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేశాడు బిగ్‌బాస్.. ఎలిమినేషన్‌ అయిన కంటెస్టెంట్లను రీ యూనియన్ పేరుతో మళ్లీ హౌస్‌లోకి పర్మిషన్ ఇచ్చాడు. ఇక తోటి కంటెస్టెంట్లు రావడంతో ఫైనలిస్టులు తెగ మురిసిపోయారు.

ఎలిమినేట్‌ అయిన సభ్యులను తిరిగి హౌస్‌లోకి పంపించడం కొత్తేమి కాదు. గత సీజన్లలో జరిగిన మాదిరిగానే ఈసారి కూడా రీపిట్ చేశారు. కానీ కరోనా కారణంగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు అద్దాల గది వరకే పర్మిషన్‌ ఇచ్చారు. ఫస్ట్‌ మోనాల్‌ను లోపలికి పంపించారు. మోనాల్‌ను చూసిన అఖిల్‌, సోహైల్‌ ఆమె వద్దకు పరుగులు తీశారు. మోనాల్‌ను చూడగానే అఖిల్‌ ఆనందానికి అవధులేకుండా పోయాయి. విన్నర్‌ కప్‌ అందుకున్నంత హ్యాపీగా ఫీలయ్యాడు.

మోనాల్‌ హౌస్‌లోకి రాగానే హగ్గుల ఉరుములు, ముద్దుల మెరుపులు మెరిశాయి. మోనాల్‌ను చూసిన ఫైనలిస్ట్‌లకు ఎక్కడ లేని సంతోషం పుట్టుకవచ్చింది. తనతో కలిసి చిందులేస్తూ నానా హంగామా చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయాక క్యూట్‌గా అయ్యావంటూ ఇంటి సభ్యులు మోనాల్‌ను మెచ్చుకోగానే జస్ట్ గ్లాస్‌ ఎఫెక్ట్ అంటూ రివర్స్ పంచ్ వేసింది మోనాల్. అఖిల్‌, మోనాల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతే మర్చిపోయారు. అద్దాలు పగిలిపోతాయేమో అన్నంతంగా హంగులు, ముద్దులు ఇచ్చుకున్నారు. తనకు మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదని మోనాల్‌ తన విరహవేదనను వినిపించింది. తాను కూడా సరిగా నిద్రపోవడంలేదని మోనాల్‌ ముందు మొర పెట్టుకున్నాడు అఖిల్‌.

మళ్లీ హౌస్‌లోకి రావాలని ముచ్చటపడింది మోనాల్. అయితే చైర్‌ వేసుకొని అద్దాల గోడ దూకి రా అంటూ సోహైల్‌ సలహా ఇచ్చాడు. నో..నో అంటూ మోనాల్‌ అక్కడి నుంచే తన ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్ చేసింది. అఖిల్‌ డ్రీమ్స్‌ నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది మోనాల్. ఈ సమయంలో అఖిలే నంబర్‌ వన్‌ అటూ మోనాల్‌ గట్టిగా అరిచింది.

ఆ తర్వాత అభిజిత్‌ ప్యూచర్‌ బెస్ట్‌గా ఉండాలని కోరుతూ బెల్లూన్లను గాల్లోకి వదిలేసింది. తర్వాత అరియానాతో తనకు ఫ్రెండ్‌షిప్‌ కావాలంటూ బెలూన్లను గాలిలోకి వదిలేసింది. అలాగే బయట కథ వేరే ఉంటుందని తన సోదరుడు లాంటి సోహైల్‌ విజేత కావాలని కోరుతూ మోనాల్‌ బెలూన్లను గాలిలోకి వదిలేసింది.

మోనాల్‌ ఇంటిసభ్యులతో మాటల్లో పడి తనకు ఇచ్చిన టైం నిబంధనను మరిచిపోయింది. ఇక బయటకు వెళ్లిపోండి అంటూ బిగ్‌బాస్‌ ఆదేశించడంతో రెండు నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్‌ అంటూ క్యూట్‌ గా రిక్వెస్ట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ కాదనలేకపోయాడు. తర్వాత అందరికీ గ్రూప్‌ హగ్‌ ఇచ్చి, అందరికీ అల్‌ ది బెస్ట్ చెప్పుకుంటూ బయటకు వెళ్లిపోయింది గుజరాతీ భామ.

మోనాల్‌ తర్వాత ఇద్దరు వంటలక్కలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కరాటే కల్యాణి, లాస్య రాగానే.. హౌసంతా గోలగోలగా మారింది. కరాటే కల్యాణి పాటు. లాస్య నవ్వులతో బిగ్‌బాస్ ‌ హౌస్‌కే కొత్తకళ వచ్చేసింది. మీ వంటలు లేక బక్కచిక్కిపోయామని ఇంటిసభ్యులు మొరపెట్టుకున్నారు. మీరు బయటకు రాగానే మంచి మంచి వంటలు చేసిపెడతామని ఇద్దరు వంటలక్కలు వాగ్ధాటిగా వాగ్ధానం చేశారు. ఫస్ట్‌ కల్యాణి హరికథ చెబుతూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంటిసభ‌్యులను చూడగానే ఎమోషనల్‌ అయి కంటతడి పెట్టుకుంది. మీ అందరిని చాలా మిస్‌ అయ్యాను అంటూ చెప్పకచ్చింది. మీ వంటలు మేము మిస్‌ అవుతున్నామని ఫైనలిస్టులు అనగానే మీ అందరికీ వంటలు చేసి పెడతానంటూ హామీ ఇచ్చింది కల్యాణి.

కల్యాణి ఇంటిసభ్యులకు కబుర్లు చెబుతుండగానే సడన్‌గా లాస్య ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఫైనలిస్టులు అరిసి, గోల చేశారు. మీపై బెంగ పెట్టుకున్నానని లాస్య చెప్పింది. బయట ఎలా ఉందని, జున్ను ఎలా ఉన్నాడని, ఇలా రకరకలా ప్రశ్నలతో లాస్యను ఉక్కిరిబిక్కిరి చేశారు ఫైనలిస్టులు. ఇక అభిజిత్‌ను చూస్తే పాపం అనిపిస్తుందని లాస్య బాధపడింది. తనతో టైమ్‌ స్పెండ్‌ చేయమని హారికను అడుక్కుంటున్నాడు ఫీలయ్యింది. ఎంత రిక్వెస్ట్ చేసినా తనతో ఉండడం లేదని లాస్యకు కంప్లైంట్‌ ఇచ్చాడు అభి. నువ్వు కూడా అభికే సపోర్ట్‌ చేస్తున్నావా అంటూ హారిక అలిగినంత పనిచేసింది.

ఇక లాస్య, కల్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించారు. ఒక్కొక్కరి గురించి అడిగిన ప్రశ‌్నలకు మిగిలిన ఇంటిసభ్యుల నుంచి ఎక్కువగా ఎస్ అని సమాధానం వస్తే ఐస్‌ స్నానం చేయాలని కండీషన్ పెట్టారు. ఇక ఈ గేమ్‌ లో చిలిపి ప్రశ్నలు అడుగుతూ అందరికీ ఐస్ స్నానం చేయించారు. ఇక చివరగా ఫైనలిస్టులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ బయటకు వెళ్లిపోయారు వంటలక్కలు.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి, ఎలిమినేషన్ అయిన కుమార్ సాయి, స్వాతి దీక్షిత్‌ తిరిగి హౌస్‌లోకి రీయూనియన్‌ కు వచ్చేశారు. వచ్చిరాగానే కుమార్ సాయి తన పాత పగను తీర్చేసుకున్నాడు. దొరికిందే చాన్స్ అని అందరిని ఓ ఆట ఆడేసుకున్నాడు. అఖిల్, హారిక, సొహైల్‌కు అయితే నవ్వుతూనే గట్టిగా ఇచ్చిపారేశాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలని పొగుడ్తునే కోలుకోని పంచ్ వేశాడు కుమార్ సాయి. సిల్లీ రీజన్స్‌తో ఎలిమినేషన్ చేసి తర్వాత బాధపడుతుందని ఆట పట్టించాడు. ఇటు సోహైల్‌ కోపాన్ని కూడా కుమార్ సాయి ప్రస్థావించాడు. ఇక్కడ నరాలు తెగవంటూ సోహైల్‌ ను గెలికాడు.

తర్వాత కుమార్ సాయి మరో బాణాన్ని అఖిల్‌ పై వేశాడు. బ్రదర్ అంటూ సంబోధిస్తూనే కావాల్సినంత దింపేశాడు. మీకు నాకు, ఇష్టమైనది ఒకటే పులిహోరా అంటూ సెటైర్ వేశాడు. కరివేపకు టాపిక్‌ను కూడా తీసుకువచ్చి మరోసారి అఖిల్‌ను నొప్పించాడు. తర్వాత అభిజిత్‌ను అందుకున్నాడు కుమార్ సాయి. ఆట ఆడేవారికి కాకుండా ఎంపైర్‌కు ఎలా పేరు వస్తుందని క్వశన్ రేస్ చేశాడు కుమార్ సాయి. ఇక చివరిలో మిమ్మల్ని చూస్తుంటే సెలబ్రెటీలను చూసినట్టు ఫీలింగ్ కలుగుతుందని ప్రకటించి, వాళ్ల కోపాన్ని తగ్గించేశాడు.

ఫైనలిస్టులకు మరింత జోష్ నింపేందుకు కుమార్ సాయి, స్వాతి దీక్షిత్‌ బిగ్‌బాస్‌ను అడిగి మరి మ్యూజిక్‌ వేయించుకున్నారు. వారందరితో కలిసి డ్యాన్స్ చేశారు. ఇక గేట్ వద్దకు వెళ్లగానే స్వాతి కన్నీళ‌్లు పెట్టుకుంది. వారందరిని మిస్ అవుతున్నాని బాధపడింది. అక్కడి నుంచి వెళ్లక తప్పదు కాబట్టి వెళ్లాలని లేకున్నా వెళ్లిపోయింది.

శుక్రవారం నాటి రీ-యూనియన్‌లో కరాటే కల్యాణి, లాస్య, మోనాల్, కుమార్‌సాయి స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేశారు. అయితే అంతకుమించి అన్నంత రేంజ్‌లో గంగవ్వ, సుజాత, అవినాష్, మెహబూబ్, దివి హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. మరీ వీళ్ల రాక ఫైనలిస్టులకు ఏ రేంజ్‌లో జోష్‌ నింపుతుందో చూడాలి.

Web Titlereunion celebration in Bigg boss house
Next Story