Renu Desai: కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

Renu Desai: కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

Arun Chilukuri
Published on: 4 April 2023 12:11 PM IST
Renu Desai Shares Emotional Post in Instagram
X

Renu Desai: కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

Renu Desai: రేణూ దేశాయ్‌‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్‌ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్‌తో పాటే ఉంటోంది. రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరలవుతోంది.

''కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అది ఒక అందమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాల్లో కొన్ని మనల్ని బాధపెడతాయి కూడా. వాళ్లు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారు. మన కన్నీళ్లను తుడిచి.. మన జీవితాల్లో వెలుగును నింపుతారు. మనల్ని నవ్విస్తుంటారు'' అని రేణూ దేశాయ్‌ తన పోస్టులో పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story