Renu Desai: పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్‌

Samba Siva Rao
Updated on: 21 April 2021 6:24 AM IST
Renudesai Latest Post Goes Viral
X

రేణుదేశయ్ ఫైల్ ఫోటో

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "బద్రి". దాదాపు 21ఏళ్ల క్రితం అంటే 2000వ సంవత్సరంలో వచ్చిన బద్రిలో ఇద్దరూ హీరోయిన్స్ నటించారు. బాలీవుడ్ హీరోయిన్ అమిషా పటేల్, రేణు దేశాయ్. ఇదంతా అలా ఉంటే ఈరోజుతో బద్రి సినిమా వచ్చి 21 ఏళ్ళు పూర్తి కావడంతో అప్పటి ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసింది ఆ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్. రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హిట్ సాంగ్ "హే చికితా" షూట్ లో గన్ పట్టుకొని ఉన్న పవన్ ముందు దుప్పట్టాలో తాను ఉన్న ఫోటోను షేర్ చేసి అప్పటి మెమొరీస్ గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత కొంత కాలం సహజీవనం చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పవన్ రేణులకు ఇద్దరు పిల్లలు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఇద్దరు వేరుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లలతో జీవిస్తోంది.

పవన్ కళ్యాణ్ అప్పటికే ఐదు సినిమాలు చేసి పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. వరుసగా సుస్వాగతం, తమ్ముడు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత స్టైలీష్ లుక్‌లో వచ్చి మరో హిట్ కొట్టాడు పవన్. పూరి జగన్నాధ్‌కు ఈ సినిమా మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ ఇక వెనుతిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ఆయన నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ విడుదలైంది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ నటించింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story