Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా.. నిజం మాట్లాడినందుకు నాకు ఇది జరగాల్సిందేలే..

Renu Desai: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది.

Arun Chilukuri
Published on: 17 Aug 2023 12:42 PM IST
Renu Desai Sensational Post on Pawan Kalyan Fans and Anti Fans
X

Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా.. నిజం మాట్లాడినందుకు నాకు ఇది జరగాల్సిందేలే..

Renu Desai: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది. రేణూ దేశాయ్‌ సోషల్‌ మీడియాలో మరోసారి తన పోస్టుతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. అందులో వ్యక్తిగతంగా పవన్ తనను మోసం చేశారని చెబుతూనే.. రాజకీయంగా అతడికే తన మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆరోపణలు.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె మరో పోస్టు చేశారు.

పవన్ యాంటీ ఫ్యాన్స్, ఇతర రాజకీయ పార్టీ అభిమానులు.. ఆమెను టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఓ అభిమాని ఆమె విడాకులపై అభ్యంతరకర కామెంట్‌ పోస్టుచేయగా.. రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్.. “పవన్ కళ్యాణ్ నిన్ను అందుకే తన్ని తరిమేశాడు” అంటూ కామెంట్ చేశాడు. దానికి రేణూ రియాక్ట్ అవుతూ.. “తన విడాకులు గురించి నిజం మాట్లాడితే నా మాజీ భర్త అభిమానులు తిడతారు. రాజకీయం పరంగా నిజం మాట్లాడితే ఆయన యాంటీ ఫ్యాన్స్ తిడతారు. అప్పుడు బయట పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా అన్నారు. ఇప్పుడు నా మాజీ భర్త దగ్గర తీసుకున్నా అంటున్నారు. నా మాజీ భర్త గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే చెప్పాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నిజంగా ప్రేమించినందుకు, నిజం మాట్లాడినందుకు నాకు ఇది జరగాల్సిందేలే. ఈ జీవితం మీతో మాటలు అనిపించుకోవడానికే ఉన్నట్లు ఉంది. మీ ఇష్టం ఇంకా తిట్టుకోండి” అంటూ పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story