Renu Desai: వాళ్ల డీటైల్స్ పంపితే సాయం చేస్తా..రేణు దేశాయ్

Renu Desai: కరోనాతో ఇబ్బంది పడుతున్నవారికి సహాయం చేసేందుకు నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు.

Kranthi
Updated on: 12 May 2021 12:19 PM IST
Renu Desai Says iam Ready to Help the Corona Patients
X

నటి రేణు దేశాయ్ (ఫైల్ ఇమేజ్)

Renu Desai: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. తాజాగా ఆరోజు ప్రభుత్వ తెలిపిన లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు మాత్రం వేల సంఖ్యల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భారత్ కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా నాటులు కూడా వారికి తోసిన విధంగా కొంత మంది ముందు వరుసలో నిలుస్తున్నారు.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ రాధేశ్యామ్ టీం, సోనూసూద్, యంగ్ హీరో సందీప్ కిషన్, అడివి శేష్ వంటి సెలబ్రెటీలు ముందుకు రాగా.. తాజాగా కష్టాల్లో ఆదుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‏స్టా‏గ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ కష్ట సమయంలో ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్, మందులు ఇలా ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని ఆమె తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో మాట్లాడిన ఆమె ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Kranthi

Kranthi

Next Story