Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణు దేశాయ్‌ రెండో పెళ్లి..?

Renu Desai: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2022 4:47 PM IST
Renu Desai Instagram Post About Companionship
X

Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణు దేశాయ్‌ రెండో పెళ్లి..?

Renu Desai: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీరు భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు. అయితే గతంలో రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. జీవితంలో ఒక తోడు అవసరం అని స్వయంగా రేణు దేశాయ్‌ కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు.

అయితే తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది. అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి' అంటూ ఓ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story