అనారోగ్యంతో బాధపడుతున్న రేణూ దేశాయ్.. ఎమోషనల్ పోస్ట్.. మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను..!

Renu Desai Falls Sick, Shares Emotional Post
x

అనారోగ్యంతో బాధపడుతున్న రేణూ దేశాయ్.. ఎమోషనల్ పోస్ట్.. మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను..!

Highlights

అనారోగ్యంతో బాధపడుతున్న రేణూ దేశాయ్.. ఎమోషనల్ పోస్ట్.. మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను..!

Renu Desai: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీరు భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు. రేణూ దేశాయ్‌‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా తన ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగా లేదని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. గత కొన్నేళ్ల నుంచి తాను పోరాడుతూనే వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్‌ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్‌ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.



Show Full Article
Print Article
Next Story
More Stories