టాలీవుడ్ స్టార్ హీరోలకు నిర్మాతల అల్టిమేటం?

టాలీవుడ్ స్టార్ హీరోలకు నిర్మాతల అల్టిమేటం?
x
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోలకు నిర్మాతలు అల్టీమేటం ఇచ్చారా? ఇక ముందు సినిమాలు చెయ్యలాంటే రెమ్యూనరేషన్ తగ్గించాల్సిందే లేదంటే అవకాశాలు లేనట్టే అంటు గట్టిగానే...

టాలీవుడ్ స్టార్ హీరోలకు నిర్మాతలు అల్టీమేటం ఇచ్చారా? ఇక ముందు సినిమాలు చెయ్యలాంటే రెమ్యూనరేషన్ తగ్గించాల్సిందే లేదంటే అవకాశాలు లేనట్టే అంటు గట్టిగానే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. సినిమా ధియేటర్లో బొమ్మ ఎప్పుడు పడుతుందో తెలీదు పెద్ద స్టార్ల సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు. అందుకే ముందు జాగ్రత్తగా హీరోలను, హీరోయిన్ లను తమ వైపు తిప్పకోవడానికి రెడీ అవుతున్నారు.

నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్ గిల్డ్ ఇటివలే సమావేశం జరిపినట్టు తెలుస్తుంది. సినిమాల రిలీజ్ లకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉండటంతో తమపై ఆర్ధిక భారం పడకుండ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో ఫస్ట్ ది స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ సగానికి సగం కట్ చేయటం, వాళ్లతో పాటు మిగతా టెక్నీషియన్స్ కు కూడ రెమ్యూనరేషన్ లో కోత పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలు వెనక్కి తగ్గరు. అందుకే ప్రొడ్యూసర్ గిల్డ్ సంయుక్తంగా హీరోలకు తమ పరిస్థితి గురించి చెప్పటం వాళ్ళు తమ మాట వినకపోతే ఇక ఆ స్టార్స్ తో సినిమాలు చెయ్యమంటు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నిర్మాతల మాటను స్టార్ హీరోలు వినే పరిస్థితి లేదు. ప్రతి స్టార్ హీరోకి సొంత బ్యానర్ వుంది. మహేష్ బాబు, రాంచరణ్, ప్రభాస్, జూనీయర్ ఎన్టీఆర్, నితిన్ ఆఖరికి నానికి కూడ సొంత బ్యానర్ వుంది. ఇక బయట నిర్మాతలతో చేసే కన్న సొంత బ్యానర్ లో చేసుకునే అవకాశం ఉంది. దీంతో అల్టీమేటం లాగా కాకుండా తమ సమస్యలు అంటు వారికి నచ్చజెప్పుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు హీరోలకు అల్టీమేటం ఇస్తే తిరిగి హీరోలు నిర్మాతలకు అల్టీమేటం ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories