అప్పుడే మొదలైన 'మహర్షి' రీమేక్ టాక్

అప్పుడే మొదలైన మహర్షి రీమేక్ టాక్
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహర్షి' సినిమా గురించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మహర్షి' సినిమా గురించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలైనా 'ఒక్కడు', 'పోకిరి' వంటి సినిమాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ లను సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే 'మహర్షి' సినిమా కూడా హిట్ అయితే ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కానీ మహేష్ బాబుకి తమిళ ఇండస్ట్రీ పైన ఎప్పటి నుండో ఒక కన్ను ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' అనే సినిమాను తమిళంలో కూడా చిత్రీకరించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అందుకని మహేష్ బాబు ఈ సారి ఎలాగైనా తమిళ ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన సినిమాలు 'బ్రహ్మోత్సవం' తో సహా తమిళంలో కూడా డబ్ అయ్యాయి. ఒకవేళ 'మహర్షి' హిట్ అయితే ఆ సినిమాను తమిళంలో కూడా మహేష్ డబ్బింగ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మహర్షి సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొక 9 రోజులు ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories