Shakuntalam: సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఖరారు..!

Release Date Fixed For Samanthas Shakunthalam
x

సమంత "శాకుంతలం" కి విడుదల తేదీ ఫిక్స్

Highlights

రిలీజ్ డేట్ ని ఖరారు చేసిన "శాకుంతలం" బృందం

Shaakuntalam: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈమధ్యనే "యశోద" సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు సామ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీనీ అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

భారీ అంచనాల మధ్య "శాకుంతలం" సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా త్రీడీలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. "శాకుంతలం" అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల మరియు దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా ఒక మైథలాజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శకుంతల పాత్రలో సమంత కనిపించనుండగా, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ఈ సినిమాలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, అనన్య నాగల్ల, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా తో సమంత ఎంత వరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి. గుణశేఖర్ కెరీర్ కి కూడా ఈ సినిమా హిట్ అవడం చాలా కీలకం కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories