Chatrapathi Remake: "ఛత్రపతి" రీమేక్ లో హీరోయిన్ గా రెజిన..!!

Regina Cassandra May Join in Chatrapathi Hindi Remake Movie As a Heroine
x

రెజిన కాసండ్ర (ఫైల్ ఫోటో)

Highlights

Chatrapathi Remake: వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న "ఛత్రపతి" సినిమా రీమేక్ కి హీరోయిన్ గా రెజిన కాసండ్రని ఎంపిక...

Chatrapathi Remake: వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న "ఛత్రపతి" సినిమా రీమేక్ కి హీరోయిన్ గా రెజిన కాసండ్రని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో శ్రియా సరన్ హీరోయిన్ గా నటించిన ఈ పాత్రకి రెజిన అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ భామ ఈ మధ్య తెలుగు సినిమాల్లో అంతగా ఆఫర్లు లేక తమిళ సినిమాల్లో నటిస్తుంది. ఇక సినిమాతో హిందీలో రెజిన ఎంట్రీ ఇవ్వబోతుందనే చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని "రంగస్థలం" సినిమా షూటింగ్ చేసిన ప్రాంతంలోనే ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్నట్లుగా ఒక భారీ సెట్ ని నిర్మించారు.

మొదట్లో ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా కియార అద్వానిని అనుకున్న చివరికి చిత్ర యూనిట్ రెజిననే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ సినిమాకి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా తనిష్క్ బాగ్చి తన సంగీతాన్ని అందించనున్నాడు. ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఛత్రపతి రీమేక్ సినిమాతో అటు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో పాటు సూపర్ హిట్ కూడా సాధించాలనే తపనతో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories