Krishnam Raju: అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju: జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసం నుంచి ఫాంహౌస్ వరకు అంతిమయాత్ర

Rama Rao
Published on: 12 Sept 2022 5:37 PM IST
Rebel Star Krishnam Raju Last Rites | Tollywood
X

అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఫాంహౌస్ వరకు కృష్ణంరాజు భౌతికకాయానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు చితికి ప్రముఖ హీరో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ నిప్పుపెట్టారు.

తమ అభిమాన నటుడికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గన్ సెల్యూట్ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోపలికి పొలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్ డీసీపీ పర్యవేక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story