Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై దాడికి అసలు కారణం అదేనా..!?

*తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగుళూరు విమానాశ్రయంలో జరిగిన దాడి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Sandeep Reddy
Published on: 5 Nov 2021 2:29 PM IST
Reasons Behind the Attack on Vijay Sethupathi in Bangalore Airport
X

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై దాడికి అసలు కారణం అదేనా..!?

Vijay Sethupathi: తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగుళూరు విమానాశ్రయంలో జరిగిన దాడి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటి..? విజయ్ సేతుపతిపై దాడి జరిగిందా లేదా అనే విషయానికొస్తే.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తరువాత కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదని.. పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు కూడా అర్పించడానికి కూడా అతని సన్నిహితులు మినహా ఎవరు రాలేదని కన్నడ సినీ అభిమానులు తమిళ నటులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా విజయ్ సేతుపతి బెంగుళూరు చేరుకొని పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించడానికి వెళ్ళడం.. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత విజయ్ సేతుపతిని చూసిన ఒక వ్యక్తి కోపంతో వెనక నుండి వచ్చి ఎగిరి తన్నడం వీడియోలో చూశాము. అయితే ఆ వ్యక్తి తన్నింది మాత్రం విజయ్ సేతుపతిని కాదని, సేతుపతి వెనుక ఉన్న వ్యక్తిని తన్నడం వల్ల అతడు విజయ్ సేతుపతిపై పడ్డాడని వీడియో చూస్తే అర్ధమవుతుంది. కాని ఆ వ్యక్తి విజయ్ సేతుపతిపై దాడి చేయడానికే వచ్చాడని అది గమనించిన విజయ్ సహచరులు వెంటనే అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని తెలుస్తుంది.

మరికొంత మంది మాత్రం దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని విజయ్ సేతుపతిని చూసి తమిళ నటుడు అని గమనించి కోపంతో దాడి చేయడానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ దాడి తరువాత విజయ్ సేతుపతి ఒక్కసారిగా షాక్ అయి ఆ వ్యక్తిని ఏమి అనకుండా అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం దాడి విషయంపై ఆగ్రహంతో ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story