Krishnam Raju: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? రెండో పెళ్లి చేసుకోవడానికి కారణమేంటంటే..

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమను కలచివేసింది.

Arun Chilukuri
Published on: 12 Sept 2022 1:35 PM IST
Reason Behind Krishnam Rajus Second Marriage
X

Krishnam Raju: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? రెండో పెళ్లి చేసుకోవడానికి కారణమేంటంటే..

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమను కలచివేసింది. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణంరాజు మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించడానికి ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఆ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. దీంతో అక్కడే కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్‌ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్లపాటు కృష్ణంరాజు డిప్రెషన్‏లోకి వెళ్లిపోయారట. ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండోపెళ్లి ఒత్తిడి తీసుకువచ్చి 1996లో తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండవ పెళ్లి చేశారు. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీళ్లు మాత్రమే కాకుండా మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు వద్దే ఉంటుంది. అలాగే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు శ్యామలాదేవి దంపతులు ఐదుగురు ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story