Keerthy Suresh: రజినీకాంత్‌కు సోదరిగా కీర్తి సురేష్?

Keerthy Suresh: చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్ సంపాదించిన తర్వాత చాలామంది నటీమణులు హీరోయిన్ పాత్రల్లో మాత్రమే నటిస్తారు.

Venkata Chari
Published on: 26 May 2021 10:33 PM IST
Reason behind Keerthy Suresh playing Rajinis sister role
X

కీర్తి సురేష‌ (ఫొటో ట్విట్టర్)

Keerthy Suresh: చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్ సంపాదించిన తర్వాత చాలామంది నటీమణులు హీరోయిన్ పాత్రల్లో మాత్రమే నటిస్తారు. సైడ్ క్యారెక్టర్లు, సోదరి పాత్రలను చేసేందుకు అంగీకరించరు. అయితే తాజా నివేదికల మేరకు, కీర్తి సురేష్ తన రాబోయే చిత్రంలో సోదరి పాత్రను పోషించనుందంట.

'మహానటి' చిత్రం అద్భుతమైన విజయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కీర్తి సురేష్. అయితే ఓటీటీలో విడుదలైన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ పరాజయాలను మూటగట్టుకుంది. అలాగే ఇటీవల నితిన్ తో రొమాన్స్ చేసిన 'రంగ్ దే'లో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఏలిన ఈ మహానటి.. తన రాబోయే సినిమా 'అన్నాతే' లో రజనీకాంత్ సోదరి పాత్రను పోషించేందుకు ఒప్పుకున్నారు. ఈ పాత్రను అంగీకరించేందుకు ఓ బలమైన కారణం ఉందంట. ఈ చిత్రంలో సోదరి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, అలాగే కథలో కీలక మలుపును సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందంట. అందుకే కీర్తి సురేష్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, కీర్తి సురేష్ తన రాబోయే సినిమా 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తుంది. కరోనాతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Venkata Chari

Venkata Chari

Next Story