ధనుష్‌-ఐశ్వర్య విడాకులు.. కారణాలు ఇవేనా..?

Reason Behind Dhanush and Aishwarya Divorce
x

ధనుష్‌-ఐశ్వర్య విడాకులు.. కారణాలు ఇవేనా..?

Highlights

Dhanush and Aishwarya Divorce: కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Dhanush and Aishwarya Divorce: కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ వివాహం నవంబర్ 2004 లో జరిగింది. వీరిద్దరికీ యాత్ర, లింగా అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 18 ఏళ్ళు కలిసి ఉన్న వీరు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు మాత్రమే కాక సినీ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక వీరిద్దరూ విడాకులు కి గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

ధనుష్ ఒక హీరోయిన్ తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని ఈ విషయంలో వారి ఇద్దరికీ మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని ఇక చేసేది లేక ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే మరోవైపు "కాలా" సినిమా ఫ్లాప్ అయినప్పుడు రజినీకాంత్ ఆర్థికంగా ఆదుకోలేదని ధనుష్ చాలా బాధ పడినట్లు, ఐశ్వర్య తో ఒక పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా రజినీకాంత్ ఒప్పుకోలేదని అందువల్లే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరికొందరు చెబుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు వీరికీ చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక విడాకుల నిర్ణయానికి వచ్చిన తర్వాత వీరు మొదట రజనీకాంత్ కే ఫోన్ చేశారట. కానీ రజనీ మాత్రం ఆ నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories