Chetabadi Movie: రియల్ ఇన్సిడెంట్‌తో 'చేతబడి'.. మనిషి వెంట్రుక ఆధారంగా భయంకరమైన కథ!

Chetabadi Movie: రియల్ ఇన్సిడెంట్‌తో చేతబడి.. మనిషి వెంట్రుక ఆధారంగా భయంకరమైన కథ!
x

Chetabadi Movie: రియల్ ఇన్సిడెంట్‌తో 'చేతబడి'.. మనిషి వెంట్రుక ఆధారంగా భయంకరమైన కథ!

Highlights

Chetabadi Movie: శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై, నిర్మాత నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం చేతబడి.

Chetabadi Movie: శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై, నిర్మాత నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం చేతబడి. ఇది నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందుతోందని చిత్రయూనిట్ వెల్లడించింది.

దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ, “చేతబడి అనేది 16వ శతాబ్దంలో భారత్‌లో మొదలైన ఓ మానసిక కళ. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువిని ఎదుర్కొనడానికి ఒక కొత్త శక్తిని ఉపయోగించే పద్ధతే ఇది. ఈవిల్ ఎనర్జీ ద్వారా ప్రత్యర్థిని కలవకుండానే చంపగలగడం చేతబడి ముఖ్య లక్ష్యం. ఇప్పటికే సినిమాల్లో దీన్ని చూపించినా, మా చిత్రం ఇందులో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

మన శరీరంలోని ప్రతి భాగానికి ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక జీవశక్తి ఉంటుంది. ఈ చిత్రం మొత్తం ఆ వెంట్రుకల ఆధారంగా తిరుగుతుంది. 1953లో జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీ అనే గ్రామంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా కథ తయారు చేశాం. అలాగే, 200 ఏళ్ల క్రితం సీలేరు అనే గ్రామంలో విపరీతంగా పెరిగే వెదురు బొంగుల మధ్య బాణామతికి సంబంధించిన రహస్యాలను పంచబోతున్నాం. అమావాస్య నాడు నల్లకోడిని ఉపయోగించి జరిగే అనూహ్య పరిస్థితులు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తాయి,” అని వివరించారు.

నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ, “ఒక సమయంలో బాణామతి భయం సమాజంలో రాజకీయ, మానసిక అల్లర్లకు కారణమైంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న బలహీన మనోభావాలను ఈ చిత్రం బహిర్గతం చేస్తుంది. రియలిస్టిక్ గా కథను చెప్పడానికి కృషి చేస్తున్నాం” అన్నారు.

ఈ కథాంశంతో ప్రేక్షకుల్ని కొత్త ఎక్స్పీరియన్స్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో చేతబడి చిత్రం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories