SS Thaman: అలా జరగటం నా జీవితంలో మొదటిసారి అంటున్నా థమన్

* నాని గారికి నా సంగీతం నచ్చలేదు అంటున్న థమన్

admin1
Updated on: 16 Nov 2021 2:30 PM IST
Real Reason Behind Why SS Thaman Left Tuck Jagadish Movie Mid Project says in an Interview
X

అలా జరగటం నా జీవితంలో మొదటిసారి అంటున్నా థమన్ (ఫైల్ ఫోటో)

SS Thaman - Tuck Jagadish Movie: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ పేరు ముందే ఉంటుంది. బ్లాక్ బస్టర్ పాటలతో కెరీర్ లో ముందుకు దూసుకు పోతున్నాడు థమన్. త్వరలో తెరకెక్కనున్న స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు చాలావరకు సినిమాలకు సంగీతాన్ని అందించనున్నారు థమన్.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ తన చేతుల నుండి వెళ్లిపోయిన సినిమా గురించి మాట్లాడారు. మీరు ఒప్పుకున్న తర్వాత మీ నుండి వెళ్లిపోయిన సినిమా ఏమైనా ఉందా అని అడగగా థమన్ "టక్ జగదీష్" అని చెప్పారు.

నిజానికి "టక్ జగదీష్" సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో లో దర్శకుడు శివ నిర్వాణ మరియు థమన్ ల మధ్య గొడవలు జరగటంతో థమన్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత థమన్ శివ నిర్వాణ ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు అని పుకార్లు కూడా వినిపించాయి.

దీని గురించి మాట్లాడుతూ "టక్ జగదీష్" సినిమా కి తను బాగా మనసు పెట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇచ్చాను కానీ అది నాని గారికి నచ్చలేదని అన్నారు. తన జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు థమన్.

admin1

admin1

Next Story