Raviteja: ఎమ్మార్వోగా అవతారమెత్తిన మాస్ మహారాజా!

Raviteja: శరత్ మండవ దర్శత్వంలో కొత్త సినిమాను ఈ రోజు షురూ చేశాడు మాస్ మహారాజా

Kranthi
Published on: 1 July 2021 1:17 PM IST
Raviteja Sharath Mandava Film Starts Shooting Here are the Details
X

Raviteja Sharath Mandava Film:(Twitter)

Ravi Teja New Movie Update: క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా ఎమ్మార్వో అవతారం ఎత్తాడు. శరత్ మండవ కొత్త దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగు సంవత్సరం 'ఉగాది' పండుగను పురస్కరించుకుని కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌లో చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం ఏమంటే.. ఈ సినిమాకు ఎమ్మార్వో అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

రవితేజ కెరియర్ లో 68 వ మూవీగా వస్తుంది ఈ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #RT68 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ ల్పోని అల్యుమ్మినియం ఫ్యాక్టరీలో ఈ రోజు (గురువారం ) సినిమా షూటింగ్ మొదలైంది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండగా.. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డు కనిపిస్తుంది. అలానే ఓ ప్రభుత్వ అధికారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక పాత లెటర్ ను కూడా ఈ పోస్టర్ లో చూపించారు.

రవితేజ సరసన హీరోయిన్'గా నాగ చైతన్య 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాన్ష కౌశిక్' నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసిందట చిత్రబృందం. మొదటి షెడ్యూల్‌లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇందులో రవితేజ లుక్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడట. నాసర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతోంది.


Kranthi

Kranthi

Next Story