సంక్రాంతి రేసులో రామ్, రవితేజ!

సంక్రాంతి రేసులో రామ్, రవితేజ!
x
Highlights

కరోనా సమయంలో స్టార్ హీరోల సినిమాలు లేవు.. లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు మూతపడడంతో షూటింగ్ అయిపోయిన సినిమాల విడుదలను వాయిదా వేశారు మేకర్స్ . తాజాగా ధియేటర్ల రీఓపెన్ కి పర్మిషన్స్ వచ్చినప్పటికీ దసరాకి సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ముందుకు రాలేదు..

కరోనా సమయంలో స్టార్ హీరోల సినిమాలు లేవు.. లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు మూతపడడంతో షూటింగ్ అయిపోయిన సినిమాల విడుదలను వాయిదా వేశారు మేకర్స్ . తాజాగా ధియేటర్ల రీఓపెన్ కి పర్మిషన్స్ వచ్చినప్పటికీ దసరాకి సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ముందుకు రాలేదు.. అయితే ఇక సంక్రాంతికే సినిమాలు విడుదల కానున్నాయి. ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు ప్లాన్ చేస్తున్నారు. దసరా సందర్భంగా హీరో రామ్, రవితేజ క్రాక్ సినిమాలను 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. అయితే 'దేవదాస్‌, మస్కా' చిత్రాల తర్వాత రెడ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు రామ్..

ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం క్రాక్.. ఈ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయదశమి సందర్భంగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు మేకర్స్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories