Tiger Nageswara Rao: టీజర్‌తో దుమ్మురేపిన టైగర్ నాగేశ్వర రావు.. రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..!

Tiger Nageswara Rao Pre Release Business: మాస్ మహారాజా రవితేజ హీరోగా రానున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పాన్ ఇండియాగా విడుదల కానుంది.

Jyothi
Published on: 25 Aug 2023 10:18 AM IST
Raviteja Pan India Movie Tiger Nageshwara Rao Pre Release rs 40 crore Business Anupamkher Muralisharma Vamsi Krishna Akella
X

Tiger Nageswara Rao: టీజర్‌తో దుమ్మురేపిన టైగర్ నాగేశ్వర రావు.. రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..!

Tiger Nageswara Rao Pre Release Business: మాస్ మహారాజా రవితేజ హీరోగా రానున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పాన్ ఇండియాగా విడుదల కానుంది. 1970ల్లో దేశంలోనే పేరుమోసిన దొంగ అయిన స్టువర్టుపురం ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా ఈ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 17న రిలీజ్ చేశారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. టీజర్ అద్భుతమైన క్వాలిటీ, గ్రాండియర్ సినిమాపై విపరీతమైన పాజిటివ్ బజ్‌ని సృష్టించింది.

అయితే, టీజర్ విడుదల తర్వాత ప్రీ బిజినెస్‌లో దూసుకపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రూ.30 కోట్ల కంటే ఎక్కువ ప్రీ బిజినెస్ అయినట్లు సమాచారం. అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ వ్యాపారం రూ.40 కోట్లకు చేరుకుంది. టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిని రేకెత్తించిందంట.

ఇక ఆంధ్ర ప్రాంతంలో రూ.15 కోట్లకు సినిమా హక్కుల బిజినెస్ జరిగినట్లు సమాచారం. తాజాగా విడుదలైన టీజర్ అద్భుతమైన విజువల్స్, మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉన్నాయి. టీజర్ ఇచ్చిన క్వాలిటీ సినిమా విడుదలపై అంచనాలను గణనీయంగా పెంచింది.

టైటిల్ క్యారెక్టర్‌పై ఫోకస్ చేసేలా టీజర్‌లో చెప్పిన డైలాగ్‌లు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చక్కగా రూపొందించారు. కరుడుగట్టిన దొంగగా రవితేజ పాత్ర స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించింది. క్రైమ్‌తో నిండిన స్టువర్ట్‌పురం నగరాన్ని ఏలుతున్న టైగర్ (రవితేజ) శక్తివంతమైన పాత్రను టీజర్ అద్భుతంగా పరిచయం చేసింది.

ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా, మురళీ శర్మ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నటించారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుదేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపిస్తుంది.

అభిషేక్ అగర్వాల్ 'టైగర్ నాగేశ్వరరావు'ను భారీ బడ్జెట్‍తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మస్తున్నారు. ఈ సినిమాకి ఆర్. మధీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ వీసా మాటలు అందించాడు.

Jyothi

Jyothi

Next Story