Driving Licence: 'డ్రైవింగ్‌ లైసెన్స్‌'లో హీరోగా ఎవరంటే?

Driving Licence: తెలుగు తెరకు మలయాళి సినిమాల రీమేక్‌ల వరద పారుతోంది.

Venkata Chari
Updated on: 31 May 2021 9:30 PM IST
Raviteja Lead Role in Driving Licence Remake
X

రామ్ చరణ్, రవితేజ (ఫొటో ట్విట్టర్)

Driving Licence: తెలుగు తెరకు మలయాళీ సినిమాల రీమేక్‌ల వరద పారుతోంది. ప్రస్తుతం వెంకటేశ్ 'దృశ్యం 2' ను తెరకెక్కింస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌ చేసేందుకు ముందుకొచ్చాడు. మరో మలయాళీ మూవీ కూడా తెలుగులో రీమేక్ అయ్యేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019లో విడుదలైన 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా.. ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారనే విషయమై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు చరణ్ లేదా పవన్ నటిస్తాడనే టాక్ వినిపించింది. అయితే, ప్రస్తుతం ఈ రీమేక్ లో రామ్ చరణ్ గానీ .. పవన్ కళ్యాణ్ గాని నటించడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుందంట. మలయాళంలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించాడు. మరి అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే విడుదల కాలేదు. ఈ సినిమాపై మరింతం సమాచారం కోసం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Venkata Chari

Venkata Chari

Next Story