Khiladi Movie: రవితేజ 'ఖిలాడి' రిలీజ్ పై క్లారిటీ

Khiladi Movie: రవితేజ ఖిలాడి రిలీజ్ పై క్లారిటీ
x
Highlights

Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ పెటింది సినిమా యూనిట్. సినిమా ఓటీటీలో విడుద‌ల చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని చెప్పారు ఈ సినిమా నిర్మాత స‌త్యనారాయ‌ణ‌.

ఈ సంద‌ర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ర‌వితేజ ఖిలాడి సినిమా థియేట‌ర్లోనే విడుద‌ల చేస్తాం.. ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని అన్నారు . షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28 న విడుదల కు సిద్దం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు . రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ..ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్ల‌గా మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి నటిస్తున్నారు . యాక్షన్ కింగ్ అర్జు, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories