Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ విడుదలకి తేదీ ఖరారు

Ravi Tejas Ramarao on Duty Going to be Release in 25th March 2022
x
రామారావు ఆన్ డ్యూటీ విడుదల తేదీ ఖరారు (ఫైల్ ఇమేజ్)
Highlights

Ravi Teja: 2022 మార్చిలో విడుదల కాబోతున్న రవితేజ సినిమా

Ravi Teja: వరుస డిసాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు ఈ సంవత్సరం మొదట్లో "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు రవి తేజ తన తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ" తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కూడా రవితేజ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. దివ్యాంశ కౌశిక్, మలయాళం నటి రజిష విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం 25 మార్చ్ 2022 విడుదల తేదీను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. శరత్ మండవ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. రవితేజ ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. విజయ్ కుమార్ చాగంటి, సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి సామ్ సీ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories