Mass Jaatara: మాస్ జాతరలో రమణ గోగుల సర్ప్రైజ్?

Mass Jaatara: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా రేపు ప్రీమియర్స్‌తో ప్రారంభమవుతుంది.

Arun Chilukuri
Published on: 30 Oct 2025 6:00 PM IST
Mass Jaatara: మాస్ జాతరలో రమణ గోగుల సర్ప్రైజ్?
X

Mass Jaatara: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా రేపు ప్రీమియర్స్‌తో ప్రారంభమవుతుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో క్రేజీ సర్ప్రైజ్ ఉందని మేకర్స్ చెప్పారు. రమణ గోగులతోనే ఆ సర్ప్రైజ్ అని హింట్.

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. రేపు గ్రాండ్ ప్రీమియర్స్‌తో థియేటర్లలో సందడి మొదలవుతుంది. మేకర్స్ ముందే థియేటర్లలో ఓ క్రేజీ సర్ప్రైజ్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు దానిపై హింట్ బయటకు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగులతోనే ఆ సర్ప్రైజ్ ఉంటుందని సమాచారం.

భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం పాటతో చాలాకాలం తర్వాత వింటేజ్ ట్రీట్ ఇచ్చిన రమణ గోగులు ఇక్కడ కూడా సర్ప్రైజ్‌గా దాచారట. ఈ సర్ప్రైజ్ ఏమిటో తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడాలి. చిత్రం విడుదలైన తర్వాతే పూర్తి వివరాలు బయటపడతాయి. అభిమానులు ఈ సర్ప్రైజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story