Bhartha Mahasayulaki Wignyapthi: సంక్రాంతి ట్రాక్ రికార్డ్.. మాస్ రాజా మాస్ కంబ్యాక్ లోడింగ్!

Bhartha Mahasayulaki Wignyapthi: రవితేజ హీరోగా సంక్రాంతికి సిద్ధమైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Arun Chilukuri
Published on: 12 Jan 2026 4:00 PM IST
Bhartha Mahasayulaki Wignyapthi: సంక్రాంతి ట్రాక్ రికార్డ్.. మాస్ రాజా మాస్ కంబ్యాక్ లోడింగ్!
X

Bhartha Mahasayulaki Wignyapthi: రవితేజ హీరోగా సంక్రాంతికి సిద్ధమైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాస్యం, ఎమోషన్స్‌తో కూడుకుని ఉంది. రవితేజ సంక్రాంతి ట్రాక్ రికార్డు ఈ సినిమాకు మరో బలమైన ఆధారం అనే చెప్పాలి.

మాస్ మహారాజ్ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో సంక్రాంతి సందడికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా రేపు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని అద్భుతంగా మేళవించారు. భార్యాభర్తల మధ్య సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌గా మార్చే అవకాశం ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరు భామల మధ్య రవితేజ పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని తెలుస్తుంది. పైగా ఈ సినిమా సెన్సార్ పూర్తయి యూ/ఏ సర్టిఫికేట్ పొందింది.

ఇంకో సూపర్ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ షార్ట్ అండ్ స్వీట్ రన్‌టైమ్ ఈ జెన్ జీ ట్రెండ్‌లో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఈ సినిమాకు మరింత ఆకర్షణ జోడించింది. ఇక రవితేజకు సంక్రాంతి ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. గతంలో వాల్తేరు వీరయ్య, క్రాక్, మిరపకాయ్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన రవితేజకు సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రమోషన్స్‌తో ఈ సినిమా బాగా బజ్ అవుతోంది. దీంతో రవి తేజకు ఈ చిత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story