Ravi Teja: సాయిధరమ్ తేజ్ రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పిన రవితేజ..

Ravi Teja: క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత మాత్రం వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నారు.

Arun Chilukuri
Updated on: 21 Sept 2022 2:00 PM IST
Ravi Teja to Team up With Sampath Nandi
X

Ravi Teja: సాయిధరమ్ తేజ్ రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పిన రవితేజ..

Ravi Teja: క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత మాత్రం వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం రావణాసుర సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రవితేజ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరోవైపు రవితేజ తాజాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా డైరెక్టర్ సంప‌త్ నంది ఒక్ స్క్రిప్టు ప‌ట్టుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాడు.

ఇప్పటికే కొంత‌మంది హీరోల‌కు కూడా వినిపించాడు. అంతా ఓకే అనుకున్న త‌ర‌వాత కూడా ఆ సినిమా మాత్రం ప‌ట్టాలెక్కలేదు. తాజాగా ఇప్పుడు ర‌వితేజకు ఈ క‌థ చెప్పగా, మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయి. అయితే ఇది ర‌వితేజ కోసం రాసిన క‌థ కాదు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ క‌థ చాలామంది హీరోల వద్దకు వెళ్లింది.

ఆఖరికి సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఈ కథకు ఓకే చెప్పాడు కానీ అంత‌లోనే ఈ సినిమా చేయ‌న‌ని చెప్పేశాడు తేజ్. ఇప్పుడు అదే క‌థ‌ని ర‌వితేజ‌కు చెప్పి ఒప్పించాడు సంప‌త్ నంది. ర‌వితేజ‌ - సంప‌త్ ల కాంబో లో "బెంగాల్ టైగ‌ర్‌" అనే సినిమా వచ్చింది. కానీ అది యావ‌రేజ్ గా ఆడింది. మరి ఈ సారి సంప‌త్ నంది మాస్ మహారాజా తో తన మాస్ మసాలా క‌థ‌తో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story